Breaking

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు దిశగా అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరు, ఆగస్టు 5: స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ఆగస్టు 6న మెప్మా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి పట్టణంలో సింగిల్‌ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రజలు, వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మున్సిపాలిటీకి సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 6న అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం వరకు జరిగే ర్యాలీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని, అనంతరం మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.