వేంపల్లి: వేంపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, రానున్న కార్యక్రమాల నిర్వహణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి సమర్థవంతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీపై మరింత విశ్వాసం పెంపొందేలా పనిచేయాలని అన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగితే సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



