వేంపల్లి: వేంపల్లి మండలం కుమ్మారంపల్లె గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి – సంక్షేమం’ కార్యక్రమంలో టీడీపీ వెంపల్లె ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
రాష్ట్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసమే తమకు అతిపెద్ద బలమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అజ్జుగుట్టు రఘునాథరెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



