కడప, ఆగస్టు 5: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలు పొందేందుకు APSCCFC వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు డా. జి. రాజ్యలక్ష్మి తెలిపారు. నమోదు చేసుకున్న అర్హులకు సంబంధిత శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి, రుణ సదుపాయాలు పొందేందుకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు.
Was this article useful?



