Breaking

23వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం ప్రచారం

బద్వేలు, ఆగస్టు 5: బద్వేలు పట్టణంలోని 23వ వార్డు (ఫాతిమా మసీదు పరిసర ప్రాంతం)లో బుధవారం “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరుతోందని, ఉచిత ఇసుక, చేనేత కార్మికులకు రాయితీలు, యువతకు ఉపాధి కల్పించే చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.