బద్వేలు: బద్వేలు పట్టణంలోని రాజుగారి వీధికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గౌనిపురం శ్రీనివాసరాజు సతీమణి శ్రీదేవి ఇటీవల పాముకాటుకు గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కె. విజయమ్మ మంగళవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



