ప్రొద్దుటూరు: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డి మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను కలిసి పట్టణంలో పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా మార్కెట్ గేటు వసూళ్లలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అలాగే ఆగస్టు 15 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Was this article useful?



