విశాఖపట్నం, జూలై 30: భోగాపురంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పరుగు పోటీ పోస్టర్‌ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాలోట్ మంత్రికి వివరించారు. పరుగు పోటీ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి, యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ, ప్రాంతీయ మేనేజర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Was this article useful?



