నిమ్మనపల్లి, జూలై 30: నిమ్మనపల్లె మండలంలో జూదం ఆడుతూ పట్టుబడిన ఏడుగురు నిందితులకు మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు ఏడు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ 25న అమ్మ చెరువు వద్ద ‘మంగతాయి’ జూదం ఆడుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17,500 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసులో నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష విధించింది.
Was this article useful?



