భోగాపురం, జూలై 30: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మంత్రులు అచ్చెం నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి టెర్మినల్ భవనం, సభా వేదిక, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Was this article useful?



