రాయచోటి :
అన్నమయ్య జిల్లా రాయచోటి రాయుడు కాలనీలో నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారంలో టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. అర్హత ఉండి ఇంకా పెన్షన్ పొందని వారికి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాలనీలోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
Was this article useful?



