రాయచోటి మున్సిపల్ చైర్మన్ గా బోనమల ఖాదర్ వలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ నాయకుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న అనంతరం పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.



