చిన్నమండెం, అక్టోబర్ 18 (కలం మనస్సాక్షి ప్రతినిధి) : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలానికి చెందిన మండి అక్రమ్ కుమారుడి హాకీకా వేడుక ఆదివారం ఏఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, మండి అక్రమ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, చిన్నారి ఆయురారోగ్యాలతో ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి రాకతో వేడుకలో సందడి నెలకొంది.
Was this article useful?



