ప్రొద్దుటూరు, అక్టోబర్ 16: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు పాత మార్కెట్‌లోని రతనాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి దేవిని విశేషంగా అలంకరించి పూజలు జరిపించారు. ఉదయం లలితా, లక్ష్మీ హోమాలతో పాటు నవావరణ యంత్రారాధన నిర్వహించారు. రతనాల వెంకటేశ్వర స్వామివారికి, లలితా దేవికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
Was this article useful?



