ప్రొద్దుటూరు, అక్టోబర్ 16: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరులోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆరో రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహ, సర్వతోభద్ర, బగళాముఖి, శాకంభరి, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి, రాహు, కేతు, వారాహి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వారాహి దేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. హోమాలు, ప్రత్యేక అలంకరణలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Was this article useful?



