వైఎస్సార్ కడప జిల్లా: వల్లూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా సి. లక్ష్మీనారాయణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో కడప రిమ్స్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై వల్లూరుకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
లక్ష్మీనారాయణ గతంలో కమలాపురం, ఎర్రగుంట్లతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసు శాఖలో విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Was this article useful?



