ప్రొద్దుటూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేయనున్న రాచమల్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, రాచమల్లు రాఘవేంద్రరెడ్డి తమ ఓటు హక్కును బదిలీ చేయాలని కోరుతూ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమ ఓట్లను దొరసానిపల్లె గ్రామ పంచాయతీ పరిధి నుంచి రామేశ్వరం మున్సిపాలిటీ పరిధికి బదిలీ చేయాలని వారు కోరారు. ఈ మేరకు కమిషనర్‌ను కలిసి తమ అభ్యర్థనను వివరించారు. నిబంధనల ప్రకారం ఓటు బదిలీ ప్రక్రియను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Was this article useful?



