కడప జిల్లా: బద్వేల్ పట్టణంలోని సుమిత్ర నగర్లో కత్తి దాడి ఘటనలో ప్రవళిక (28) అనే మహిళ మృతి చెందింది. కడప నగరంలోని విశ్వనాథపురానికి చెందిన ఆమె, బద్వేల్లోని తన మేనత్త ఇంట్లో ఉంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సాయిబాబా అనే వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. వీరిద్దరి మధ్య గతంలో మనస్పర్థలు ఉన్నట్లు తెలిసినప్పటికీ, దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. గాయపడిన ప్రవళికను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఘటనపై పోలీసుల అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Was this article useful?



