కొర్రపాడులో రైతులకు అవగాహన కార్యక్రమం
కొర్రపాడు: ఎల్నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.ఆర్.కె. శర్మ సూచించారు. శుక్రవారం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొర్రపాడులో అవగాహన ర్యాలీ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పశువులకు స్వచ్ఛమైన తాగునీరు, నీడ, గాలి ప్రసరణ కల్పించాలని, ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని నిపుణులు తెలిపారు. వేడి ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎంవీఎస్సీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, వాలంటీర్లు పాల్గొని రైతులకు పశుసంపద సంరక్షణపై అవగాహన కల్పించారు.



