Breaking

ప్రొద్దుటూరులో తొలి రోజు 13 నామినేషన్లు

చైర్మన్‌ పదవికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు

ప్రొద్దుటూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం ప్రశాంతంగా సాగింది. తొలి రోజు కౌన్సిలర్‌ పదవులకు మొత్తం 13 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ తెలిపారు. చైర్మన్‌ పదవికి మాత్రం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని వెల్లడించారు.

అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ల కోసం సింగిల్‌ విండో విధానంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం భద్రపరిచారు.

స్పెషల్‌ నోడల్‌ ఆఫీసర్‌ వెంకటపతి ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 17, 18 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.