Breaking

హామీల డబ్బులు ఇస్తేనే టీడీపీకి ఓటేయండి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌, సంక్షేమ పథకాల హామీలను అమలు చేయకుండా ప్రజలను విస్మరించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల ప్రకారం ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలు అందించిన తర్వాతే ఓట్లు అడగాలని అన్నారు.

బీసీలకు ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున ఇస్తామన్న హామీని అమలు చేయాలని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించిన హామీని కూడా అమలు చేయాలని కోరారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని రాచమల్లు సూచించారు. హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపిస్తూ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.