Breaking

ఎన్నికల సిబ్బందికి రుచికరమైన భోజనం.. స్వయంగా వడ్డించిన కమిషనర్

ప్రొద్దుటూరు:. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బందికి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా సిబ్బందికి భోజనం వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించిన కమిషనర్, ప్రతి ఒక్కరూ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, భోజనం, ఇతర వసతుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.