ప్రొద్దుటూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఈ. బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రం పరిసరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతూ నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఈ బందోబస్తులో పట్టణ సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



