Breaking

26వ వార్డులో పారిశుధ్య సమస్యలపై రాచమల్లు దంపతుల పర్యటన

ప్రొద్దుటూరు: పట్టణంలోని 26వ వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాంతకుమారి వీధి, ఆకులోళ్ల వీధుల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత రెండున్నరేళ్లుగా కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించాల్సి ఉండగా, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళే పారిశుధ్యంపై హడావుడి కనిపిస్తోందంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.