రాయచోటి పట్టణంలోని ఫయాజ్ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి కె. రామాపురం నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన నూలివీటి రామాంజులు ఆహ్వానం మేరకు, కీర్తిశేషులు నూలివీటి రాఘవయ్య కుమారుడు వెంకటేశ్వర్లు, నందిని వివాహ వేడుకకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Was this article useful?



