రాయచోటి, అక్టోబర్ 3 (కలం మనస్సాక్షి ప్రతినిధి) : అన్నమయ్య జిల్లాలో 2026-27 సంవత్సరానికి 17 మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి మధుసూదన్ తెలిపారు. లైసెన్సుల కోసం దరఖాస్తులను అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 6న దరఖాస్తుల పరిశీలన, స్క్రూటినీ, అక్టోబర్ 7న అర్హులైన దరఖాస్తుదారుల జాబితా ప్రకటన, అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 2, రాయచోటి రూరల్‌లో 1, చిన్నమండెంలో 2, ఎల్.ఆర్.పల్లిలో 1, గాలివీడులో 1, ములకలచెరువులో 1, పెద్దమండెంలో 1, పెద్దతిప్పసముద్రంలో 1, తంబళ్లపల్లిలో 1, గుర్రంకొండలో 2, పుంగనూరు మున్సిపాలిటీలో 3, సోమలలో 1 చొప్పున మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయని వెల్లడించారు. దుకాణాన్ని బట్టి 2026-27 సంవత్సరానికి లైసెన్స్ ఫీజు రూ.60.50 లక్షల నుంచి రూ.71.50 లక్షల వరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు నిర్ణీత రుసుముతో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి మధుసూదన్ సూచించారు. మరిన్ని వివరాల కోసం 7981216391 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.



