Breaking

కమిషనర్ సేవలకు ఉద్యోగుల నీరాజనం

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: ప్రజా సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా వ్యవహారాల్లో చురుకైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య యాదవ్ కమిషనర్ సేవలను ప్రశంసించారు.

2014లో సామాజిక భద్రతా పెన్షన్ పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరును ప్రతిపాదించే విషయంలో తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచనలు అందించినట్లు వెంకటసుబ్బయ్య యాదవ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఆ పేరును అధికారికంగా ఆమోదించిందని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు కమిషనర్ చొరవ చూపుతున్నారని, ఉద్యోగులతో సమన్వయంతో పనిచేస్తూ వారి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సేవల మెరుగుదలకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అన్నారు. మున్సిపాలిటీని అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సేవల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, సచివాలయ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.