పులివెందుల, సెప్టెంబర్ 30: రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధితో పాటు రైతులకు మార్కెటింగ్, నిల్వ, రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘రైజింగ్ రాయలసీమ’లో భాగంగా అక్టోబర్ 2న హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.
హబ్‌లో వేర్‌హౌస్‌లు, కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్లకు సబ్సిడీలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి రాయితీలు అందిస్తున్నట్లు చెప్పారు.
పులివెందులలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.450 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అరటి, చీనీ పంటలకు మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హార్టికల్చర్ హబ్‌కు మద్దతుగా రైతులు పులివెందులలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.



