Breaking

మున్సిపల్ స్థలాలపై జేసీ నజర్

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: పట్టణంలోని మున్సిపల్ ఆస్తులను పరిరక్షిస్తూ, ఖాళీగా ఉన్న స్థలాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నిధి మీనా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌తో కలిసి జేసీ పరిశీలించారు. స్థలంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సూచించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా స్థలాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు తెలిపారు.

మున్సిపల్ స్థలాలకు హద్దులను స్పష్టంగా గుర్తించి, ఆక్రమణలకు అవకాశం లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పట్టణంలో అందుబాటులో ఉన్న మున్సిపల్ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

స్థల అభివృద్ధి, పచ్చదనం, సుందరీకరణకు సంబంధించిన పనులతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్‌ను జేసీ ఆదేశించారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణతో పాటు పట్టణ సుందరీకరణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.