Breaking

పులివెందుల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గాడిన పడాలి ఆర్డీవోకు వైఎస్సార్‌సీపీ నేతల వినతి

పులివెందుల, సెప్టెంబర్‌ 30:
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం ఆర్డీవో, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి చిన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

చెత్త సేకరణ వాహనాల నిర్వహణను మెరుగుపరచి పారిశుద్ధ్యాన్ని పటిష్టం చేయాలని, కుక్కలు, పందుల బెడదను నియంత్రించాలని కోరారు. బోర్లలో నీటిమట్టం తగ్గడం, మోటార్లు కాలిపోవడం వల్ల తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేయడంతో పాటు డ్రైనేజీ, యూజీడీ సమస్యలను పరిష్కరించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, హల్‌ గంగాధర్‌రెడ్డి, పార్నపల్లి కిషోర్‌, సుదికర్‌, బ్యాటరీ ప్రసాద్‌, చంద్రమౌళి, కొంగనపల్లి రవికుమార్‌, కొంగనపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.