Breaking

అక్టోబర్‌ 5న పులివెందులకు సీఎం, డిప్యూటీ సీఎం పార్నపల్లె వద్ద తాగునీటి పథకం ప్రారంభం

పులివెందుల, సెప్టెంబర్‌ 30: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అక్టోబర్‌ 5న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలం పార్నపల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన తాగునీటి పథకాన్ని వారు ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత వెల్లడించారు.

సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై మంగళవారం కడపలో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో మంత్రి సవిత అధికారులతో సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు కార్యక్రమ నిర్వహణ, రహదారులు, తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.