ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 882 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 877 పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు పూర్తయ్యాయి. ఐదు పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదని డిప్యూటీ ఈవో శివప్రసాద్ తెలిపారు.
ప్రొద్దుటూరు మండలంలోని కొన్ని జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లోనూ ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహించి ఎస్ఎంసీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఎస్ఎంసీలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
Was this article useful?



