పులివెందుల, సెప్టెంబరు 29: పట్టణంలోని నగరిగుట్ట మంగళ్స్ట్రీట్ కాలనీలో కొద్దిపాటి వర్షానికే వర్షపు నీటితో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమలు, పురుగుల బెడద పెరుగుతోందని వాపోతున్నారు.
సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ స్వయంగా కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Was this article useful?



