Breaking

ఆపదలో రక్తదానం.. బాధితుడికి చేయూత

ఎర్రగుంట్ల: కడపలోని సూర్య హాస్పిటల్‌లో కిడ్నీ ఫెయిల్యూర్‌తో చికిత్స పొందుతున్న వెంకటరమణకు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ‘మే ఐ హెల్ప్‌ యు’ ఫౌండేషన్‌ స్పందించింది. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మోరే లక్ష్మణ్‌రావును సంప్రదించగా వెంటనే రక్తదాతను ఏర్పాటు చేశారు.

ఫౌండేషన్‌ సభ్యుడు మాచుపల్లి కుమార్‌ ఎర్రగుంట్ల నుంచి కడపకు వెళ్లి ఓ పాజిటివ్‌ రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన కుమార్‌ను ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.