పులివెందుల: పులివెందుల వైఎస్సార్ బస్ టెర్మినల్ రాష్ట్ర పర్యాటక అవార్డుల్లో ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ బస్‌స్టాండ్’ విభాగంలో గుర్తింపు పొందింది. ఆధునిక నిర్మాణశైలి, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లతో టెర్మినల్ ప్రత్యేకతను సంతరించుకుంది.
విశాలమైన ప్రాంగణంతో ఎయిర్‌పోర్టును తలపించేలా నిర్మించిన ఈ టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ఒకేసారి 225 మంది కూర్చునేలా 95 బెంచీలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
ప్రయాణికుల భద్రత కోసం 55 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సురక్షిత తాగునీరు, అత్యవసర ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా రూపొందించిన ఈ టెర్మినల్‌కు రాష్ట్ర స్థాయిలో పర్యాటక అనుకూల బస్స్టాండ్గా గుర్తింపు లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



