ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మంగళవారం స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మల్లెల ఉమ, ఆమె భర్త, ఎంవీఆర్ కుమారుడు మల్లెల మురళీధర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎంవీ రమణారెడ్డి ప్రజాసేవకు అంకితమై పనిచేశారని, విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని వారు పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అనంతరం మల్లెల ఉమ విద్యార్థినీ, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుమ్మటమయ్య, కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి. భాస్కర్‌రెడ్డి, డాక్టర్ ఏ. శంకర్‌రెడ్డి, డాక్టర్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ పి. మధుసూదన్‌బాబు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



