ప్రొద్దుటూరు: వర్షాల నేపథ్యంలో నగరంలో పారిశుధ్యం, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సులభ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలను తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంతంలో టైర్లలో నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించి మలాథియాన్ స్ప్రేయింగ్ చేపట్టాలని సూచించారు. రానున్న రెండు రోజుల్లో ఫాగింగ్ నిర్వహించాలని, నిల్వ ఆహార పదార్థాల విక్రయాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కమిషనర్ కోరారు.
Was this article useful?



