బద్వేల్: గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలోని బైపాస్ హైవేపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు నుంచి బద్వేల్ పరిసర ప్రాంతాలకు బండలు సరఫరా చేస్తూ వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను బద్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Was this article useful?



