ప్రొద్దుటూరు, సెప్టెంబరు 23: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 29న ప్రొద్దుటూరు గాంధీరోడ్డులో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని హోలిస్టిక్ హాస్పిటల్ జనరల్ మేనేజర్, ఎన్జీవో హోమ్ అధ్యక్షుడు రామసుబ్బయ్య కలిసి ఆహ్వానించారు. హృదయ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వాక్‌థాన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Was this article useful?



