పులివెందుల, సెప్టెంబరు 23: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని జెండామాను వీధికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. జెండామాను చిన్నతో పాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీ ఇన్చార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి టీడీపీ నాయకులు స్వాగతం పలికి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మద్దూరు వెంకట్రామిరెడ్డి, మహబూబ్ బాషా, గడ్డం అమర్నాథ్ యాదవ్, అన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి, నల్లాగారి భాస్కర్‌రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



