పులివెందుల: పేదలకు కేటాయించిన డీకేటీ, ప్రభుత్వ ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సూచించారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ను కలిసి రిజిస్ట్రేషన్లకు అవసరమైన పత్రాలపై చర్చించారు.
మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి అవసరమైన పత్రాలను సకాలంలో సమకూర్చుకుని ఎలాంటి జాప్యం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. డీకేటీ లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించేలా పట్టాదారు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీటెక్ రవి సూచించారు.
Was this article useful?



