Breaking

సాప్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టొద్దు! బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు: సాప్‌ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక వైఎంఆర్‌ కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో డీఎస్సీ ఉపాధ్యాయులపై దాడి చేయడం బాధ్యతారాహిత్య చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, సుమారు 50 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, పీఎఫ్‌ నిధుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. సాప్‌ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కామిశెట్టి బాబు, రామానాయుడు, టప్పా మహబూబ్‌ బాష పాల్గొన్నారు

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.