Breaking

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పోలీసుల మెరుపుదాడులు 9 మంది అరెస్ట్‌.. 87 దుంగలు, 5 వాహనాలు స్వాధీనం

కడప, సెప్టెంబరు 23: జిల్లాలో ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ప్రత్యేక దాడులు నిర్వహించి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.810 టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగించిన ఐదు వాహనాలను సీజ్ చేశారు.
మన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42, వీరబల్లి పరిధిలో 8, ఖాజీపేట పరిధిలో 37 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఎర్రచందనం అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఎర్రచందనాన్ని నరికినా, దాచినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవని, నేరాలను పునరావృతం చేసే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.