పులివెందుల: వైఎస్సార్, జగన్లను ముఖ్యమంత్రులుగా అందించిన పులివెందులలో గతంలో తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి విమర్శించారు. ప్రస్తుతం అమృత్ పథకం ద్వారా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
పులివెందుల మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాణితోట, శ్రీనాథ్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తామన్నారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి రూపాయిని అభివృద్ధి పనులకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.
పట్టణంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను సుమారు ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగర్గుట్ట, జయమ్మ కాలనీలు, రాజారెడ్డి నగర్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని బీటెక్ రవి పేర్కొన్నారు.



