చెన్నూరు: కడప జిల్లా చెన్నూరులోని యల్లమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు అమ్మవారి కిరీటం, ముక్కుపుడక, చెవి పోగులతో పాటు సుమారు అర కిలో వెండి ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. తెల్లవారుజామున ఆలయం తెరిచిన అర్చకులు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. అమ్మవారి ఆభరణాలు చోరీ కావడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ భద్రతను మరింత పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
Was this article useful?



