కడప: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు నిర్వహించిన దాడుల్లో దాదాపు తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని జడ్చర్ల ప్రాంతంలోని ఓ ప్రత్యేక ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో జాకీర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మరోవైపు, నాగదస్తగిరిరెడ్డి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సోమవారం స్వయంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు సుమారు టన్ను ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం పోలీసులు అధికారిక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Was this article useful?



