వేముల: మండల కేంద్రంలోని స్మార్ట్ కిచెన్‌ను పేర్ల శేషారెడ్డి సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరల నాణ్యతతో పాటు వంటకాల తయారీ, పరిశుభ్రత, పాఠశాలలకు ఆహారం సకాలంలో చేరుతున్న తీరుపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని శేషారెడ్డి సూచించారు. ఆహారం తయారీ నుంచి పాఠశాలలకు పంపిణీ చేసే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు.
Was this article useful?



