Breaking

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ పందిరి పూజతో ప్రారంభమైన దసరా మహోత్సవాల సందడి

ప్రొద్దుటూరు: పట్టణంలోని ప్రఖ్యాత అమ్మవారి శాలలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణంలో పందిరి పూజ కార్యక్రమాన్ని అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మల్లెం కొండు ప్రతాప్, ఉత్సవ కమిటీ కన్వీనర్లు మురికి సుబ్రహ్మణ్యం, బచ్చు పవన్‌కుమార్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని పేర్కొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.