Breaking

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మనోహర్‌రెడ్డి నగరిగుట్టలో నీరు, డ్రైనేజీ సమస్యలపై తక్షణ స్పందన

పులివెందుల: నగరిగుట్ట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలపై వైఎస్ మనోహర్‌రెడ్డి చొరవ చూపారు. స్థానిక మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని సావధానంగా విని వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు స్పందించాలని మనోహర్‌రెడ్డి కోరారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి విజ్ఞప్తిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ హఫీజ్, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్, మున్సిపల్ నాయకులు కొంగనపల్లి రవికుమార్, భాషా, చల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.