Breaking

ఎన్నికలకు ముందే పోలింగ్ కేంద్రాలు సిద్ధం కావాలి.. అధికారులకు కమిషనర్ ఆదేశాలు

ప్రొద్దుటూరు: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, ర్యాంపులు తదితర సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోపాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులుకు సూచించారు.
ఈరోజు, రేపు అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, మౌలిక వసతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 25వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించారు. దివ్యాంగ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.